తిరుపతికి చేరుకున్న సిట్ బృందం.. విచారణ ప్రారంభం

ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మకఘటనలపై విచారణ చేపట్టేందుకు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం తిరుపతి చేరుకుంది

Update: 2024-05-18 07:40 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మకఘటనలపై విచారణ చేపట్టేందుకు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం తిరుపతి చేరుకుంది. తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో టీడీపీ చంద్రగిరి అభ్యర్థి పులవర్తి నానిపై జరిగిన దాడి ఘటనపై స్థానిక పోలీసుల నుంచి అడిగి వివరాలను తీసుకుంటుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఐజీ వినీత్ బ్రిజిలాల్ నేతృత్వంలో పదమూడు మంది సభ్యులతో కూడిన ఒక బృందాన్ని చీఫ్ సెక్రటరీ నియమించారు.

హింసాత్మక ఘటనలపై...
ఈ బృందం తిరుపతి, తాడిపత్రి, పల్నాడు జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ బృందం విచారణ జరిపి ఎన్నికల కమిషన్ కు నివేదిక అన్పగించనుంది. అధికారుల వైఫల్యమా? లేక అనుకోకుండా జరిగిన ఘటనలా? అన్న దానిపై సిట్ వివరాలను సేకరిస్తుంది. ఈ సందర్భంగా సిట్ బృందం కొందరు రాజకీయ నేతలను అరెస్ట్ చేసే అవకాశముంది. ముందుగా అక్కడి కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో విచారణ జరిపి వారు ప్రాధమికంగా నిర్వహించిన దర్యాప్తు వివరాలను సేకరించనుంది.


Tags:    

Similar News