ఎసెన్షియా ప్రమాదంపై నేడు హైలెవెల్ కమిటీ
అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం పై నేడు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి కమిటీ వేయనుంది
అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం పై నేడు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి కమిటీ వేయనుంది. ఫార్మా కంపెనీ ప్రమాదం జరిగి పదిహేడు మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై ఈ హైలెవెల్ కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాదం జరిగిన రోజు తెలిపారు.
కారణాలేంటి?
ఈ మేరకు ఈ కమిటీ పరిశ్రమలో ఎందుకు ప్రమాదం జరిగింది? అందుకు కారణాలేంటి? ఇంత భారీ పేలుడు సంభవించడానికి కారణాలేంటన్న దానిపై హైలెవెల్ కమిటీ విచారణ జరపనుంది. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి యాభై లక్షలు, స్వల్పంగా గాయాలైన వారికి పాతిక లక్షలను ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.