Ap Elections Counting : కౌంటింగ్ రోజు అప్రమత్తంగా ఉండాల్సిందే
ఆంధ్రప్రదేశ్ లో స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరగనుండటంతో స్ట్రాంగ్ రూమ్ లవద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలను మొహరించారు. ముఖ్యంగా కౌంటింగ్ రోజు తర్వాత ఘర్షణలు జరిగే అవకాశమున్న పల్నాడు, అనంతపురం జిల్లాల్లో పెద్దయెత్తున కేంద్ర బలగాలను దింపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
కేంద్ర బలగాలను...
అవసరమైతే మరిన్ని బలగాలను రంగంలోకి దింపేందుకు సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు అందాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144వ సెక్షన్ ను విధించారు. ఎవరూ ఎలాంటి ఊరేగింపులు, ర్యాలీలు చేయకూడదని నిర్ణయించారు. పెట్రోలు బంకుల యజమానులకు కూడా స్పష్టమైన ఆదేశాలు అందాయి. పెట్రోలు విడిగా అమ్మవద్దని ఆదేశాలు అందాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్ లోని సున్నితమైన ప్రాంతాల్లో పటిష‌్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.