బాబోయ్ ఎండలు
ఈ వేసవిలో ఎండలు మండి పోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు భగ్గుమంటున్నాయి. దీంతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు
ఈ వేసవిలో ఎండలు మండి పోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు భగ్గుమంటున్నాయి. దీంతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచే ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. దీనికి తోడు వడగాల్పులు కూడా ఎక్కువగా వీస్తుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకే భయపడిపోతున్నారు. సామాన్యప్రజలు పనుల కోసం బయటకు వచ్చి ఎండతీవ్రత తట్టుకోలేక రోగాల బారిన పడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే పరిస్థితి ఉంటోంది.
అధిక ఉష్ణోగ్రతలు...
దీనికి తోడు మరో నాలుగు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రతి చోట నలభై డిగ్రీల దాటుతుంది. ప్రకాశం జిల్లా మద్దిపాడులో అత్యధికంగా 43.27 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు ఈ వేసవిలో తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లేకుంటే వడదెబ్బ తగిలే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.