దుర్గమ్మను దర్శించుకున్న జస్టిస్ ఎన్వీరమణ

ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.

Update: 2021-12-25 04:48 GMT

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు ఇంద్రకీలాద్రిపైన ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఆలయ ప్రసాదాలను వారికి అందచేశారు.

మూడు రోజుల పాటు....
జస్టిస్ ఎన్వీ రమణ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఏపీకి వచ్చారు. ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. దుర్గగుడి వద్ద జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు మంత్రి పేర్నినేని, జిల్లా కలెక్టర్ నివాస్ తోపాటు పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని స్వాగతం పలికారు.


Tags:    

Similar News