రేపు తిరుపతికి జస్టిస్ ఎన్వీ రమణ
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ రేపు తిరుపతికి రానున్నారు. డాలర్ శేషాద్రి అంత్యక్రియల్లో ఆయన పాల్గొననున్నారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ రేపు తిరుపతికి రానున్నారు. డాలర్ శేషాద్రి అంత్యక్రియల్లో ఆయన పాల్గొననున్నారు. డాలర్ శేషాద్రి 1978 నుంచి తిరుమల శ్రీవారి సేవలో ఉన్నారు. ఆయనకు దేశ వ్యాప్తంగా ప్రముఖలందరికీ పరిచయాలున్నాయి. వీఐపీలను దగ్గరుండి డాలర్ శేషాద్రి దర్శనం చేయించేవారు. అలాగే జస్టిస్ ఎన్వీ రమణ డాలర్ శేషాద్రి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
రేపు అంత్యక్రియలు....
శ్రీవారి సేవలపై డాలర్ శేషాద్రికి ఉన్న పరిజ్ఞానం సామాన్యమైనది కాదని జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ఆలయ ఆచారాలపై ఆయనకు అవగాహన ఉందన్నారు. శేషాద్రి మృతి తనకు వ్యక్తిగతంగానే కాకుండా టీటీడీ కి తీరని లోటని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. కాగా డాలర్ శేషాద్రి అంత్యక్రియలు రేపు తిరుపతిలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి జస్టిస్ ఎన్వీ రమణ హాజరుకానున్నారు.