ఈ నెల 24న ఏపీకి జస్టిస్ ఎన్వీ రమణ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు ఏపీలో పర్యటించనున్నారు. చీఫ్ జస్టిస్ గా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి జస్టిస్ ఎన్వీరమణ తన స్వగ్రామమైన పొన్నవరం గ్రామం వెళ్లనున్నారు. అక్కడ సన్నిహితులతో గడుపుతారు.
న్యాయాధికారుల సదస్సులో...
ఈనెల 25న జరిగే వివిధ కార్యక్రమాల్లో జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొననున్నారు. అలాగే ఈ నెల 26వ తేదీన ఎన్వీరమణ నాగార్జున యూనివర్సిటీలో జరగనున్న న్యాయాధికారుల సదస్సులో పాల్గొంటారు. అనంతరం ఆయనను న్యాయవాదుల సంఘం, బార్ కౌన్సిల్ సన్మానించనున్నారు. ఏపీ హైకోర్టును కూడా జస్టిస్ ఎన్వీ రమణ సందర్శించే అవకాశముంది.