నేడు సుప్రీంలో సునీత పిటీషన్

నేడు సుప్రీంకోర్టులో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి పిటిషన్‌పై విచారణ జరగనుంది.

Update: 2023-04-21 02:41 GMT

నేడు సుప్రీంకోర్టులో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సునీత సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్టు ఈ నెల 25వ తేదీ వరకూ అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సునీత తరుపున న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈరోజు కూడా...
మరోవైపు ఈరోజు కూడా కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డిని సీబీఐ అధికారులు విచారణ చేయనున్నారు. ఈ హత్య కేసులో దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంపైనే ప్రధానంగా ప్రశ్నలు వేయనున్నారు. ఈ కేసులో అరెస్టయిన భాస్కర్ రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డిని కూడా తమ కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఇప్పటి వరకూ ముగ్గురిని వేర్వేరుగా విచారించిన సీబీఐ అధికారులు ఈరోజు కలిపి విచారించే అవకాశముందని తెలుస్తోంది.


Tags:    

Similar News