అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు
ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టిస్తామని టాస్క్‌ఫోర్స్ ఇన్‌ఛార్జి, ఎస్ఈబీ డైరెక్టర్ ఆవుల రమేష్ రెడ్డి హెచ్చరించారు
ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టిస్తామని టాస్క్‌ఫోర్స్ ఇన్‌ఛార్జి, ఎస్ఈబీ డైరెక్టర్ ఆవుల రమేష్ రెడ్డి హెచ్చరించారు. ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తిరుపతిలోని లీలామహల్ సెంటర్ నుంచి కరకంబాడీ మీదుగా కడప జిల్లా వరకూ రమేష్ రెడ్డి తన బృందంతో తనిఖీలు నిర్వహించారు. వాహనాల తనిఖీతో పాటు కంట్రోల్ రూమ్ లు, చెక్ పోస్టులను తనిఖీ చేశారు. ఆంజనేయపురం చెక్ పోస్టులో ఎక్కువ సేపు ఉండి అక్కడ సిబ్బంది పనితీరును గమనించారు.
తెల్లవారుజాము వరకూ....
అక్కడి నుంచి రైల్వే కోడూరు మీదుగా తెల్లవారుజామున నాలుగు గంటల వరకూ కడప జిల్లా వరకూ తనిఖీలు చేశారు. శేషాచలం అడవుల్లో కూంబింగ్ చేస్తున్న టీం తీరును కూడా ఆయన పరిశీలించారు. ఆ టీంకు పట్టుబడిన నిందితులను ఆవుల రమేష్ రెడ్డి విచారించారు. కడప జిల్లాలోని అడవుల నుంచి ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేసే పాయింట్లను కూడా ఆయన తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో రమేష్ రెడ్డి తో పాటు రైల్వేకోడూరు, కడప టాస్క్‌ఫోర్స్ అధికారులు కూడా పాల్గొన్నారు.