పరిహారం పెంచండి.. బాధితులను ఆదుకోండి
భవిష్యత్ తరాల కోసం త్యాగాలు చేసిన ముంపు బాధితులకు నష్టపరిహారం పెంచాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు.
భవిష్యత్ తరాల కోసం త్యాగాలు చేసిన ముంపు బాధితులకు నష్టపరిహారం పెంచాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల తరుపున ఆయన చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. ప్రభుత్వ సాయం అరకొరగానే అందుతుందని పేర్కొన్నారు. ఇటీవల సంభవించిన వరదలకు వేల కుటుంబాలు నిరాశ్రయులయ్యాయని చంద్రబాబు పేర్కొన్నారు. వారందరికీ సాయం అందించాలని, దశల వారీగా కాకుండా అందరికీ ఒక్కసారే చెల్లించేలా చూడాలని సీఎస్ కు రాసిన లేఖలో చంద్రబాబు కోరారు.
ఆక్వారంగానికి...
ప్రతి కుటుంబానికి పదివేలు, పూర్తిగా దెబ్బతిన్న ఇంటికి 25 వేల రూపాయలు అందించాలని కోరారు. అలాగే పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు పదివేలు ఇవ్వాలన్నారు. నీట మునిగి పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. హెక్కారుకు కనీసం ఇరవై ఐదు వేలు అందించాలన్నారు. ఆక్వా కల్చర్ కు యాభై వేలు ఇవ్వాలని సీఎస్ కు రాసిన లేఖలో చంద్రబాబు కోరారు. వరదలలో మృతి చెందిన వారికి కుటుంబానికి పది లక్షల ఎక్స్ గ్రేషియో ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.