జగన్ నరహంతకుడు.. బాబు హాట్ కామెంట్స్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నరహంతకుడు అని అన్నారు;
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నరహంతకుడు అని అన్నారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మృతుల కుటుంబసభ్యులను చంద్రబాబు పరామర్శించారు. మహిళల తాళిబొట్లను జగన్ తెంచుతున్నాడని చంద్రబాబు ఆరోపించారు. తనను కలిస్తే పెన్షన్ ను కూడా ఆపేస్తామని బాధిత కుటుంబాలను వైసీపీ నేతలు బెదిరించారన్నారు. నాడు గొడ్డలిపోటును గుండెపోటు అని చెప్పిన జగన్ నేడు సారా మరణాలను సహజమరణాలంటున్నారని ఎద్దేవా చేశారు.
ఎక్స్ గ్రేషియో చెల్లించాల్సిందే.....
జంగారెడ్డిగూడెంలో 26 మంది చనిపోతే సహజ మరణాలని ఎలా చెప్పగలరంటూ చంద్రబాబు ప్రశ్నించారు. తాను చేసేవి ప్రజా రాజకీయాలన్నారు. తనపై గత ఎన్నికల సందర్భంగా ఎన్నో నిందలు వేశారని, ప్రజలు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారని చంద్రబాబు అన్నారు. మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కనీసం వైన్ షాపుల్లో ఆన్ లైన్ చెల్లింపులు కూడా పెట్టడం లేదన్నారు. కల్తీ సారా తాగి చనిపోయిన వారి కుటుంబాలకు తాము పార్టీ నుంచి లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియో చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.