కృష్ణంరాజు మృతి పట్ల చంద్రబాబు సంతాపం
ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష‌్ణంరాజు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు
ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష‌్ణంరాజు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. తన విలక్షణమైన నటనతో కృష్ణంరాజు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. ఆయన మరణం తనకెంతో బాధ కలిగించిందని చంద్రబాబు అన్నారు. కేవలం నటుడిగానే కాకుడా కేంద్ర మంత్రిగా కృష్ణంరాజు చేసిన సేవలను ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
లోకేష్ కూడా....
కృష‌్ణంరాజు మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలిపారు. కృష్ణంరాజు మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా సంతాపాన్ని ప్రకటించారు. ఆయన మృతి సినీరంగానికే కాకుండా రాజకీయ రంగానికి కూడా లోటు అని లోకేష్ ట్వీట్ చేశారు.