వీడియో కాన్ఫరెన్స్ లో వారిని హెచ్చరించిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు హెచ్చరికలు జారీ చేశారు. 94 మంది అభ్యర్థులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు చంద్రబాబు. ప్రతి వారం పనితీరు పర్యవేక్షిస్తానని తెలిపారు. ఎన్నికల వరకు ప్రతివారం రోజులకు ఒక సర్వే చేయిస్తానని.. పనితీరు సరిగా లేకపోతే మాత్రం వేరే వాళ్లకు సీట్లు కేటాయిస్తానని తెలిపారు.
టికెట్లు వచ్చేశాయనే నిర్లక్ష్యం వద్దని హెచ్చరించారు చంద్రబాబు. ప్రభుత్వ విధానాలతో పాటు స్థానిక ఎమ్మెల్యేల పనితీరును ఎండగట్టేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలని.. జనసేన కేడర్‌తోనూ సమన్వయం చేసుకుంటూ ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా, గెలుపే లక్ష్యంగా పార్టీ అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు. ఎవరైనా అసంతృప్తితో ఉంటే ఒకటికి పది సార్లు స్వయంగా వెళ్లి కలవాలని స్పష్టం చేశారు. తానే అభ్యర్థిని కదా అని ఇగోతో వ్యవహరిస్తే కుదరదన్నారు. ఏ స్థాయిలో కూడా చిన్న తప్పు, పొరపాటు జరగకూడదన్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించామని, ఇప్పుడు 99 చోట్ల ఉమ్మడి అభ్యర్థులనూ ప్రకటించామన్నారు. జగన్ ఎన్నికలకు సిద్ధంగా లేడని చంద్రబాబు అన్నారు. సిద్ధం అని సభలు పెడుతూ అభ్యర్థులను మాత్రం ప్రకటించలేకపోయాడని గుర్తు చేశారు.