జగన్ ఢిల్లీ వెళ్లింది అందుకే

ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లింది కేసుల నుంచి తప్పించుకోవడానికేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు;

Update: 2022-01-04 08:30 GMT

ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లింది కేసుల నుంచి తప్పించుకోవడానికేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఢిల్లీ వెళ్లి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను రక్షించుకునేందుకే వెళ్లారన్నారు. తనపై ఉన్న సీబీఐ కేసుల విషయంలో మాట్లాడుకునేందుకు వెళ్లారన్నారు. ప్రత్యేక హోదా ఏమయిందని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి జగన్ రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని చంద్రబాబు అన్నారు.

బ్రాండ్ ఇమేజ్....
ముఖ్యమంత్రిగా జగన్ ఉండటం వల్ల ఏపీ బ్రాండ్ దెబ్బతినిందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం పూర్తిగా అంధకారంలో ఉండిపోయిందన్నారు. పుట్టిన ప్రతి బిడ్డ మీద అప్పుల భారం పెరిగిపోతుందని చంద్రబాబు ఆందోళన చెందారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టడంతో రాష్ట్రం ఎటు పోతుందో తెలియని పరిస్థితి ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.


Tags:    

Similar News