ప్రజలే భరించాలి... వాళ్లే తిరగబడాలి
ప్రజా పోరాటం ద్వారానే జగన్ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు;
ప్రజా పోరాటం ద్వారానే జగన్ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్ విధ్వంసకర చర్యలను మేధావులు ఖండించాలన్నారు. ప్రజలు, యువతలో చైత్యన్యం తీసుకురావాలని చంద్రబాబు పిలుపునిచచారు. జగన్ పాలనలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ విధ్వంసమయ్యాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర భవిష్యత్ పూర్తిగా అంధకారంలోకి నెట్టివేశారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
చైతన్యం వస్తేనే.....
రాష్ట్ర పరిస్థితిపై ఉద్యోగులు, ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. ప్రజల్లో చైతన్యం వస్తే తప్ప ఈ ప్రభుత్వ అరాచకాలకు అడ్డుకట్ట వేయలేమని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆస్తులను తాకట్టుపెట్టడమే పనిగా పెట్టుకుందన్నారు. ప్రజలపై చెత్త పన్నుతో పాటు అనేక పన్నులతో భారం మోపడమే లక్ష్యంగా పెట్టుకుందని చంద్రబాబు అన్నారు. జగన్ చేసే అప్పులు జనం మాత్రమే చెల్లించాలని, ఈ విషయాన్ని గుర్తుకుపెట్టుకుని ప్రజలు ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ప్రశ్నించాలని కోరారు. ప్రభుత్వం అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.