Chandrababu : కియా.. తెచ్చా...అదీ తమ్ముళ్లూ మన మన రేంజ్
మొన్నటి వరకూ ప్రభుత్వాన్ని చూసి భయపడ్డారని, ఇప్పుడు ఎవరూ భయపడాల్సిన పనిలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు
మొన్నటి వరకూ ప్రభుత్వాన్ని చూసి భయపడ్డారని, ఇప్పుడు ఎవరూ భయపడాల్సిన పనిలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఉందని ఆయన అన్నారు. నిన్నటి వరకూ కేసులతో బెదిరించారని, ఇప్పుడు భయపడాల్సిన పనిలేదని ఆయన అన్నారు. రాప్తాడులో జరిగిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రానికి అత్యంత కీలకమని అన్నారు. తాను ఎవరినీ భయపెట్టడానికి ఇక్కడకు రాలేదని, అహంకారి విధ్వంసంతో లూటీ చేసిన జగన్ ను ఇంటికి పంపాలని ఆయన పిలుపు నిచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్నే కాదు ప్రజలను కూడా లూటీ చేశారన్నారు.
విద్యుత్తు ఛార్జీలను పెంచి...
విద్యుత్తు ఛార్జీలను పెంచి జనాలను దోచుకున్నారన్నారు. తమ్ముళ్లూ ఐదేళ్ల టీడీపీ పాలనలో విద్యుత్తు ఛార్జీలు పెరిగాయా? అని ప్రశ్నించారు. జగన్ తొమ్మిదిసార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచారన్నారు. జగన్ ఒక సైకో అని అన్నారు. రాబోయే రోజుల్లో అన్నీ మంచివని, మీ పొలంలోనే విద్యుత్తును తయారు చేసుకునే పరిస్థితిని తీసుకు వస్తానని చెప్పారన్నారు. తాను అధికారంలోకి రాగానే మద్యం ధరలను తగ్గిస్తానని చెప్పారు. నాసిరకం మద్యం ఇచ్చి మగవాళ్ల రక్తాన్ని జలగలా పీల్చాడని ఆయన అన్నారు. ఆ డబ్బులన్నీ తాడేపల్లి ప్యాలెస్ కు వెళుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. జగన్ డబ్బులిచ్చి బిర్యానీ పెట్టిన సిద్ధం సభలకు పోవడం లేదన్నారు.
జగన్ ను నిలదీయండి...
జగన్ ఇక్కడకు వస్తే నిలదీయాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. మద్యపాన నిషేధాన్ని తెస్తానని చెప్పి నాసిరకం మద్యాన్ని తెచ్చాడన్నారు. తాము అధికారంలోకి వస్తే నాలుగువేల రూపాయల పింఛను ఇస్తామని తెలిపారు. ఇసుకను కూడా అమ్ముకుని దోచుకున్న వైసీపీ నేతలను తరిమికొట్టాలని ఆయన కోరారు. జగన్ డబ్బు ఆశ తగ్గలేదని అన్నారు. అందుకే మరోసారి అవకాశమివ్వాలని కోరుతున్నాడన్నారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ఉపాధి అవకాశాలు టీడీపీ కూటమి అధికారంలోకి వస్తేనే మెరుగుపడతాయని అన్నారు. భవన నిర్మాణ రంగ కార్మికులు ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. జగన్ ను ఇంటికి పంపించాలని ఆయన పిలుపు నిచ్చారు.