విజయసాయిరెడ్డిపై బుద్దా వెంకన్న ఫిర్యాదు
విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న పోలీస్ కమిషనర్ ను కోరారు
సీఎం చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న పోలీస్ కమిషనర్ ను కోరారు.విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఆయన అన్నారు. విజయసాయి బెదిరించి, బ్లాక్ మెయిల్ చేస్తే.. భయపడిపోతారా అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. కాకినాడ పోర్టును జగన్ బలవంతంగా లాక్కున్నారనేది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారరు. ఆదాయం వచ్చే ఆస్తులు ఎవరు అమ్మరని, కేవీ రావు నుంచి మీరు ఎలా తీసుకున్నారో చెప్పాలంటూ బుద్దా వెంకన్న ప్రశ్నించారు.
అరాచకాలపై ప్రజలు ...
2019 నుంచి 2024 వైసీపీ నాయకులు చేసిన దాడులు, దారుణాలు అన్నీ ఇన్నీ కావని, ఎంతోమంది బాధితులు ఇప్పుడు పోలీసులకు, కలెక్టర్లకు ఫిర్యాదులు చేస్తున్నారుని బుద్దా వెంకన్న తెలిపారు. కెవి రావు కూడా ఇదే విధంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. కులాన్ని అంటగడతావా అంటూ విజయసాయిరెడ్డిపై మండిపడ్డారు. జగన్ తప్పు చేయలేదని, లాక్కోలేదని నిరూపించే దమ్ము విజయసాయిరెడ్డికి ఉందా అని నిలదీశారు. మీ తప్పులు, పాపాలను ఎత్తి చూపితే.. కులం పేరుతో కుట్రలు చేస్తారా అంటూ ధ్వజమెత్తారు.