వైసీపీ స్కెచ్ మామూలుగా ఉండదు : లోకేష్
ఎన్నికల్లో గొడవలు సృష్టించేందుకు వైసీపీ స్కెచ్ వేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేస్ అన్నారు;
ఎన్నికల్లో గొడవలు సృష్టించేందుకు వైసీపీ స్కెచ్ వేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేస్ అన్నారు ఆయన మంగళగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా కూటమిదే ఘనవిజయం అని తెలిపారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలకమైనవని, వైసీపీ నాయకులు కావాలని గొడవలు సృష్టిస్తారని, ప్రజలు ఓపికతో తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు.
ప్రజా వేదిక విధ్వంసంతో...
2019లో ప్రజావేదిక ధ్వంసంతో పాలన ప్రారంభించిన జగన్ రివర్స్ పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. మూడుముక్కలాటతో ఏ ఒక్క ప్రాంతంలోనూ ఒక్క ఇటుక వేయలేదన్న లోకేష్ తాను మాత్రం విశాఖలో నిబంధనలకు విరుద్ధంగా 500కోట్లతో విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించుకున్నారని ఆరోపించారు. ఈ కట్టడానికి అనుమతులు లేవని కేంద్రం 200 కోట్ల జరిమానా విధించిందన్నారు. ఒక్కడి కోసం 700 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, ఈ డబ్బుతో మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్లులేని పేదలందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వొచ్చని తెలిపారు.