టీడీపీ సీనియర్ నేత శత్రుచర్ల చంద్రశేఖర్ కన్నుమూత
వైసిపి ఆవిర్భవించిన తర్వాత.. ఆ పార్టీలో చేరి కీలక నేతగా వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు అనంతరం వైసిపిని వీడి..
అమరావతి : టిడిపి సీనియర్ నేత శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తొలుత కాంగ్రెస్ లో పనిచేసిన చంద్రశేఖర్.. ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాగూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా 1989 నుంచి 1994 వరకు బాధ్యతలను నిర్వర్తించారు.
వైసిపి ఆవిర్భవించిన తర్వాత.. ఆ పార్టీలో చేరి కీలక నేతగా వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు అనంతరం వైసిపిని వీడి.. టిడిపిలో చేరారు. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు చంద్రశేఖర్ రాజు సోదరుడు. అలాగే మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి స్వయానా మామయ్య అవుతారు. చత్రుచర్ల మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియజేసి, శత్రుచర్ల ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు.