దారపనేని నరేంద్రకు బెయిల్

Update: 2022-10-14 02:11 GMT

టీడీపీ కేంద్ర కార్యాలయ మీడియా కో ఆర్డినేటర్ దారపనేని నరేంద్రకు అర్ధరాత్రి దాటిన తరువాత బెయిలు లభించింది. నరేంద్రను సీఐడీ అధికారులు గత సాయంత్రం న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచేందుకు గుంటూరులోని సీఐడీ ప్రత్యేక న్యాయస్థానం ప్రాంగణానికి తీసుకొచ్చారు. అయితే, అప్పటికే కోర్టు సమయం ముగిసిపోవడంతో న్యాయమూర్తి ఇంటి వద్ద నరేంద్రను హాజరుపరిచారు. సీఐడీ అధికారులు తనను తీవ్రంగా కొట్టారన్న నరేంద్ర ఫిర్యాదు నేపథ్యంలో తొలుత ఆయనకు జీజీహెచ్‌లో పరీక్షలు నిర్వహించి నివేదిక ఇవ్వాలని న్యాయమూర్తి కె.శృతవింద అధికారులను ఆదేశించారు. దీంతో రాత్రి 10.30 గంటల సమయంలో భారీ బందోబస్తు మధ్య నరేంద్రను జీజీహెచ్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో తిరిగి నరేంద్రను న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. వైద్యుల నివేదికను న్యాయమూర్తికి అందించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం నరేంద్రకు బెయిలు మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

కస్టడీలో తనను తీవ్రంగా కొట్టి హింసించారన్న నరేంద్రబాబు ఆరోపణల్లో లేదని స్పష్టం చేశారు. దర్యాప్తులో భాగంగా చట్టప్రకారం నిందితులను అరెస్ట్ చేసిన సమయంలో వారు తమపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని అన్నారు. వాటిలో నిజం లేదన్నారు. నిందితుడు నరేంద్ర ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగేలా పోస్టులు పెట్టినట్టు దర్యాప్తులో తేలిందన్నారు. తన సెల్‌ఫోన్‌లోని సాక్ష్యాలను చెరిపివేసినట్టు గుర్తించామని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News