Breaking : చంద్రబాబుకు భారీ ఊరట
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్ లభించింది.;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్ లభించింది. ఈ మేరకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు చెప్పింది. లక్ష రూపాయల పూచీకత్తును సమర్పించాలని హైకోర్టు షరతు విధించింది. అంగళ్లు కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇద్దరు పూచీకత్తు సమర్పించాలని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.
లక్ష పూచీకత్తు...
దీనిపై ఇరు వర్గాల వాదనలను విన్న హైకోర్టు నిన్న తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు తీర్పు చెప్పింది. అంగళ్లు కేసులో మాత్రం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో టీడీపీ నేతల్లో ఆనందం కనిపిస్తుంది. చిత్తూరు జిల్లా పర్యటనలో అంగళ్లుకు వెళ్లినప్పుడు అక్కడ జరిగిన ఘర్షణలో పోలీసులు గాయపడటంతో చంద్రబాబును మొదటి నిందితుడిగా చేర్చారు. అప్పటి నుంచి చంద్రబాబు ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో అరెస్టయిన టీడీపీ నేతలు కొందరు బెయిల్‌పై బయటకు వచ్చారు.