నేడు కూడా కుప్పంలోనే చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మూడో రోజు కుప్పంలో పర్యటించనున్నారు.

Update: 2022-01-08 02:22 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మూడో రోజు కుప్పంలో పర్యటించనున్నారు. ఆయన గత రెండు రోజుల నుంచి కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తాను తిరిగి కుప్పం నుంచి బరిలోకి దిగుతానని తన పర్యటనలో చంద్రబాబు స్పష్టం చేశారు. పొత్తులపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పరిస్థితులను బట్టి పొత్తులు అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్దారు.

ముఖ్య నేతలతో....
ఈరోజు కూడా చంద్రబాబు కుప్పంలో చంద్రబాబు పర్యటిస్తారు. ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశమవుతారు. రానున్న కాలంలో పార్టీని బలోపేతం చేసే అంశంపై చర్చిస్తారు. ప్రధానంగా చిత్తూరు జిల్లాలో నేతలతో ప్రత్యేకంగా సమావేశమై వివిధ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని గురించి చర్చిస్తారు.


Tags:    

Similar News