జగన్ మూల్యం చెల్లించుకోక తప్పదు.. బాబు వార్నింగ్

జగన్ చేసిన ప్రతి తప్పుకూ మూల్యం చెల్లించుకోక తప్పదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు.;

Update: 2022-02-11 03:43 GMT

జగన్ చేసిన ప్రతి తప్పుకూ మూల్యం చెల్లించుకోక తప్పదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. అక్రమ కేసులు బనాయించి తెలుగుదేశం పార్టీ నేతలను వేధిస్తున్నారన్నారు. భయభ్రాంతులను చేయడానికే అక్రమ అరెస్ట్ లు చేస్తున్నారన్నారు. దీని వల్ల జగన్ సాధించేదేమీ ఉండదని చంద్రబాబు అన్నారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే జగన్ రోజుకో అంశాన్ని తెరపైకి తెస్తున్నారని, అశోక్ బాబు అరెస్ట్ కూడా అందులో భాగమేనని చంద్రబాబు అన్నారు.

ఉద్యోగుల తరుపున....
ప్రభుత్వ ఉద్యోగుల తరుపున పోరాటం చేస్తున్నందుకే అశోక్ బాబును అక్రమంగా అర్ధరాత్రి అరెస్ట్ చేశారన్నారు. ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు మరోసారి అశోక్ బాబు అరెస్ట్ తో నిజమని తేలిందన్నారు. అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు. ఇవేమీ కోర్టులో నిలబడే కేసులు కాదని, న్యాయస్థానంలో పోరాడి తేల్చుకుంటామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.


Tags:    

Similar News