Chandrababu : నేడు బెయిల్ పై విచారణ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ కేసుపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.;

Update: 2023-11-07 04:16 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ కేసుపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. అమరావతి ఇన్నర్‌ రింగ్ రోడ్డు కేసులో నేడు విచారణ ప్రారంభం కానుంది. ఈ కేసులో నేటి వరకూ చంద్రబాబును అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు వరకూ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో స్టే ఇచ్చింది.

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో...
అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఈరోజుతో స్టే ముగియడంతో మరొకసారి బెయిల్ పొడిగిస్తారా? లేదా? అన్న ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు ఇప్పటికే స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో అనారోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. ఆయన హైదరాబాద్ లో ఆరోగ్య పరీక్ష లు చేయించుకుంటున్నారు. దీంతో ఈ కేసు పై బెయిల్ ను పొడిగించే అవకాశాలున్నాయని ఆయన తరుపున న్యాయవాదులు చెబుతున్నారు.


Tags:    

Similar News