నేడు టీడీఎల్పీ సమావేశం... బాబు దిశానిర్దేశం
తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష సమావేశం మరికాసేపట్లో జరగనుంది
తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష సమావేశం మరికాసేపట్లో జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో ఆయన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేయనున్నారు.
మూడు రాజధానుల బిల్లుపై...
ప్రధానంగా ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టాలనుకుంటుంది. ప్రవేశపెడితే ఏ విధంగా పార్టీ తరుపున వ్యతిరేకించాలో చంద్రబాబు ఎమ్మెల్యేలకు చెప్పను్నారు. అలాగే అమరావతి రైతులు రెండో విడత పాదయాత్ర చేస్తున్న సమయంలోనే అక్రమ అరెస్ట్ లు చేస్తుండటంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. సీఐడీ అధికారులపై ప్రయివేటు కేసులు వేయడంపై కూడా చంద్రబాబు నేతలతో చర్చించనున్నారు.