నేడు యువగళం ఇలా
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి 84వ రోజుకు చేరుకుంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి 84వ రోజుకు చేరుకుంది. నేడు కూడా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జరగనుంది. ఇప్పటి వరకూ నారా లోకేష్ 1073.9 కిలో మీటర్ల దూరం నడించారు. ఈరోజు – నందవరం నుంచి పాదయాత్ర ప్రారంభం అయింది. సాయంత్రం 4.15 వద్ద నందవరం జడ్ పిహెచ్ఎస్ స్కూలు వద్ద వడ్డెర సామాజికవర్గీయులతో భేటీ కానున్నారు. 4.30 గంటలకు నందవరం కల్వర్టు వద్ద కురుబ సామాజికవర్గీయులతో సమావేశమవుతారు. 4.40 గంటలకు నందవరం రెయిన్ బో స్కూలు వద్ద దళితులతో సమావేశం అవుతారు.
వరస భేటీలతో...
సాయంత్రం ఐదు గంటలకు నందవరం ఆలయం వద్ద బిసి సామాజికవర్గీయు లతో సమావేశంలో పాల్గొంటారు. 5.10 గంటలకు నందవరం ఎల్ఎల్ సి కెనాల్ వద్ద జగ్గాపురం గ్రామస్తులతో భేటీ అవుతారు. 5.30 గంటలకు బాపురం గ్రామంలో బొప్పాయి రైతులతో సమావేశం అవుతారు. 6.20 గంటలకు ముగటి గ్రామంలో పిలేకమ్మ దేవాలయం వద్ద ధర్మాపురం గ్రామస్తులతో సమావేశమవుతారు. 6.35 గంటలకు ముగటి గ్రామంలో యువతతో సమావేశం కానున్న లోకేష్ అనంతరం ముగటి సెంటర్ లో స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రికి ఎమ్మిగనూరులోని ఈఎస్‌వి వే బ్రిడ్జి వద్ద బస చేయనున్నారు.