నేడు జంగారెడ్డిగూడెంకు చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు జంగారెడ్డి గూడెం వెళ్లనున్నారు. అక్కడ మృతి చెందిన కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు జంగారెడ్డి గూడెం వెళ్లనున్నారు. అక్కడ మృతి చెందిన కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు. జంగారెడ్డి గూడెంలో నాటుసారా తాగి దాదాపు 18 మంది వరకూ మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు.
వారికి భరోసా...
ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నేడు చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా ఇవ్వనున్నారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా పార్టీ శ్రేణులు పెద్దయెత్తున స్వాగత ఏర్పాట్లు చేశాయి. పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.