చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకుంది అందుకే
చంద్రబాబు ఎప్పుడూ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు
చంద్రబాబు ఇక శాసనసభకు రానని చెప్పి వెళ్లపోయారు. ఇంతటి కీలక నిర్ణయం తీసుకోవడానికి కారణాలేంటి? చంద్రబాబును బాధపెట్టిన అధికార పార్టీ నేతల మాటలేంటి? అన్నది చర్చనీయాంశంగా మారింది. సభలో మాజీ హోంమంత్రి మాధవరెడ్డి ప్రస్తావనను వైసీపీ నేతలు తెచ్చారు. దీంతోనే చంద్రబాబు బాగా హర్ట్ అయ్యారు. తన కుటుంబ సభ్యుల పేర్లను కూడా సభలోకి తెస్తున్నారని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రతిపక్ష నేతగా....
చంద్రబాబు ఎప్పుడూ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రతిపక్ష నేతగా పదేళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటికీ ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. శాసనసభకు ఖచ్చితంగా హాజరవుతారు. అలాంటి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే వరకూ సభలో అడుగు పెట్టనని వెళ్లిపోవడం పార్టీలోనూ చర్చనీయాంశమైంది. వైసీపీ నేతలు మాట జారారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు అసెంబ్లీలో ఉండి పోరాడాలని పలువురు కోరుతున్నారు.