రాజంపేటలో ఉద్రిక్తత.. కౌంటింగ్ కేంద్రం వద్ద?
రాజంపేట మున్సిపల్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత తలెత్తింది. టీడీపీ అభ్యర్థులను కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించారు.;
రాజంపేట మున్సిపల్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత తలెత్తింది. టీడీపీ అభ్యర్థులను కౌంటింగ్ కేంద్రంలోకి పోలీసులు అనుమతించారు. ఏజెంట్లను మాత్రం అనుమతించలేదు. ఏజెంట్ల ఫారాలపై ఎన్నికల అధికారి సంతకం, ముద్ర లేదన్న కారణంగా ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించేందుకు నిరాకరించారు.
సీల్ లేదని
దీంతో టీడీపీ ఏజెంట్లకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు మాత్రం మున్సిపల్ అధికారి సీల్ లేనిదే అనుమతించబోమని చెబుతున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.