ఆ ఆంధ్రజ్యోతి కథనం పూర్తిగా అవాస్తవం: ఏపీ సీఐడీ అడిషనల్‌ డీజీపీ

''సీఐడీ సంజయ్‌కి జగన్‌ షాక్‌.. తాడేపల్లి ప్యాలెస్‌కు పిలిచి క్లాస్‌ తీసుకున్న సీఎం.. సెలవులో దళిత ఐపీఎస్‌ అధికారి'' అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక

Update: 2023-07-06 15:12 GMT

''సీఐడీ సంజయ్‌కి జగన్‌ షాక్‌.. తాడేపల్లి ప్యాలెస్‌కు పిలిచి క్లాస్‌ తీసుకున్న సీఎం.. సెలవులో దళిత ఐపీఎస్‌ అధికారి'' అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇవాళ (జూలై 6వ తేదీన) మెయిన్‌ ఎడిటోరియల్‌ పేజీలో ఓ కథనాన్ని ప్రచురించింది. ఏమైందో ఏమో తెలియదు గానీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌ని తాడేపల్లి ప్యాలెస్‌కు పిలిపించి ఆయనకు సీఎం జగన్‌ గట్టిగా క్లాస్‌ తీసుకున్నారని, ఆ అవమానం భరించలేక ఆయన సెలవుపై వెళ్లిపోయారని ఆంధ్రజ్యోతి తన కథనంలో ప్రచురించింది. సంజయ్‌ స్థానంలో శ్రీకాంత్‌కు చార్జ్‌ ఇవ్వనున్నారని, సీఎం జగన్‌ అవసరానికి అందలం.. తీరాక అవమానాలు గురి చేస్తారని పేర్కొంది. సునీల్‌కుమార్‌ నుంచి సంజయ్‌ వరకు దళిత అధికారులందరికీ ఇదే జగన్‌ కానుక అంటూ ఆంధ్రజ్యోతి తన కథనంలో పేర్కొంది.

తాజాగా ఈ కథనంపై ఏపీ సీఐడీ అడిషనల్‌ డీజీపీ మాట్లాడారు. ఈ వార్తా కథనం ఎలాంటి వాస్తవాలు లేకుండా, మీడియాలో పక్షపాత అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తోందని తెలిపారు. ఈ కథనం న్యాయమైన, ఖచ్చితమైన రిపోర్టింగ్ యొక్క ప్రిన్సిపుల్స్‌ని, నైతికతను ఉల్లంఘిస్తుందని అన్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా క్లాజ్ 8(1) జారీ చేసిన జర్నలిస్టిక్ ప్రవర్తనా నియమావళిలో ''వార్తాపత్రిక ఊహాగానాలు లేదా వ్యాఖ్యానాలను అందించకూడదు. ఈ వార్తా కథనం స్పష్టమైన ఊహాగానం మాత్రమే, ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక బాధ్యతారహితమైన రిపోర్టింగ్ చేస్తోందని అని అన్నారు. ఆంధ్రజ్యోతి పబ్లిషింగ్ హౌస్ ఇలాంటి ధృవీకరించబడని సమాచారాన్ని ప్రచురించకుండా నిరోధించడం అవసరమని, ఇది సాధారణంగా ప్రజలను తప్పుదారి పట్టించడానికి, సంబంధిత ప్రభుత్వ సేవకుల పరువుకు దారితీయవచ్చని అన్నారు. పబ్లిషింగ్ హౌస్‌ల ద్వారా ప్రచురించే ఇలాంటి కథనాలు చట్టపరంగా బాధ్యత వహించబడతాయని సీఐడీ అడిషనల్‌ డీజీపీ పేర్కొన్నారు. 

Tags:    

Similar News