పీఆర్సీపై నేడు హైకోర్టులో విచారణ
ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పీఆర్సీపై విచారణ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ సంఘాల ఆందోళన ప్రారంభమయింది. గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య దూరం మరింత పెరుగుతూ వస్తుంది. రోజురోజుకూ ఇద్దరి మధ్య మాటల యుద్ధం కూడా ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో ఈరోజు హైకోర్టులో పీఆర్సీపై విచారణ జరగనుంది.
సింగిల్ బెంచ్ నుంచి.....
గతంలో సింగిల్ బెంచ్ కు ముందు పీఆర్సీ వివాదం వచ్చింది. అయితే జీతాల్లో కోత విధించే హక్కు ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. జీతాలు పెరిగాయా? లేదో? చెప్పాలని కోరింది. అయితే ఈ అంశం చీఫ్ జస్టిస్ విచారణ చేస్తారని సింగిల్ బెంచ్ ధర్మాసం తేల్చి చెప్పింది. దీంతో ఈరోజు పీఆర్సీపై హైకోర్టులో విచారణ జరగనుంది.