వివేకా హత్య కేసులో కీలక పరిణామం

వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ అధికారి రాంసింగ్ పై కేసు నమోదుపై హైకోర్టు స్టే ఇచ్చింది

Update: 2022-02-23 13:53 GMT

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ అధికారి రాంసింగ్ పై కేసు నమోదుపై హైకోర్టు స్టే ఇచ్చింది. కడప కోర్టు ఆదేశాలతో పోలీసులు సీబీఐ అధికారిపై కేసు నమోదు చేశారు. దీనిపై సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో స్టే ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

దస్తగిరి వాంగ్మూలాన్ని....
మరోవైపు వివేకా హత్య కేసులో సీబీఐ స్పీడ్ పెంచింది. దస్తగిరి వాంగ్మూలాన్ని సీబీఐ న్యాయస్థానం నుంచి తీసుకుంది. దస్తగిరి వాంగ్మూలంలో ఉన్న విషయాలపై సీబీఐ విచారణను చేయాలని నిర్ణయించింది. ఈ కేసును దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు చేయాలని నిర్ణయించారు.


Tags:    

Similar News