సమ్మె విరమణ పట్ల అసంతృప్తి
సమ్మె విరమణ పట్ల ఉద్యోగ సంఘాల నేతలపై అసంతృప్తి వ్యక్తమవుతోంది
సమ్మె విరమణ పట్ల ఉద్యోగ సంఘాల నేతలపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రధానంగా ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంతో జరిపిన చర్చల పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఆర్ఏ విషయంలోనూ ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. తమకు 12 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాల్సి ఉండగా దానిని పది శాతానికి తగ్గించడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు తప్పుపడుతున్నాయి.
ఉపాధ్యాయ సంఘాలు....
ప్రభుత్వంతో పీఆర్సీ సాధన సమితి జరిపిన చర్చలు తమకు ఆమోదయోగ్యంగా లేవని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలన్నీ సమావేశమవ్వాలని నిర్ణయించాయి. తమ డిమాండ్లను సాధించుకునేందుకు ఉద్యమ కార్యాచరణను ప్రకటించేందుకు సిద్ధమవుతామని ఆయన చెప్పారు. ఉపాధ్యాయులకు 27 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు.