Tirumala : క్యూలైన్ ఈరోజు ఎంత పొడవు ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. గురువారం కూడా భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంది
తిరుమలలో భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. గురువారం కూడా భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంది. క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. గతవారం రోజుల నుంచి తిరుమల వీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. వసతి గృహాలు దొరకక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. మాడవీధుల్లోనూ భక్తులు విశ్రాంతి తీసుకుంటున్నారంటే ఏ స్థాయిలో భక్తుల సంఖ్య ఉందో అర్థం చేసుకోవచ్చు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లలో భక్తులు నిండిపోయి బయట వరకూ క్యూ లైన్ విస్తరించింది. బయట ఏటీసీ వరకూ లైన్ ఉంది. ఉచిత దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 80,048 భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 35,403 మంది భక్తులు తలనీలలాను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం4.17 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.