తిరుపతి తొక్కిసలాట ఘటనపై నేడు విచారణ
తిరుపతి తొక్కిసలాట ఘటనపై మూడోదశ విచారణ జరుగుతుంది;

తిరుపతి తొక్కిసలాట ఘటనపై మూడోదశ విచారణ జరుగుతుంది. ఈరోజు కొందరు అధికారులను కమిషన్ విచారించనుంది. వైకుంఠ ఏకాదశి టోకెన్లు జారీ సందర్భంగా తిరుపతిలోని ఒక కేంద్రంలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. దీంతో కమిషన్ రెండు రోజుల నుంచి విచారణ చేయడం ప్రారంభించనుంది.
ఘటన జరిగిన సమయంలో...
ఆ ఘటన జరిగిన సమయంలో టోకెన్లు జారీ కేంద్రం వద్ద ఎంత మంది పోలీసులున్నారు? ఎంతమందిని నియమించాలని కోరారు? అధికారుల పర్యవేక్షణ తదితర అంశాలపై చర్చించనున్నారు. రద్దీ పెరుగుతున్న సమయంలో ఎందుకు పోలీసుల సంఖ్యను పెంచలేదన్న విషయాన్ని కూడా ప్రస్తావించనున్నారు. ఈరోజు కమిషన్ ఎదుటకు తిరుపతి మాజీ ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో,టీటీడీ గోశాల డైరెక్టర్ హరినాథ్, డీఎస్పీ రమణలు విచారణకు హాజరుకానున్నారు. ఇద్దరినీ ప్రభుత్వం బదిలీ ఈ ఘటన జరిగిన వెంటనే బదిలీ చేసింది.