శాశ్వత పరిష్కారం లేదా?
తిరుమల ఘాట్ రోడ్డు ప్రమాదకరంగా మారింది. కొండచరియలు విరిగిపడుతుండటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.
తిరుమల ఘాట్ రోడ్డు ప్రమాదకరంగా మారింది. కొండచరియలు విరిగిపడుతుండటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్డులోని కొండచరియలు విరిగిపడుతున్నాయి. మూడు రోజుల పాటు తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అందుకే టీటీడీ ఢిల్లీ నుంచి ఐఐటీ నిపుణులను రప్పించి దీనికి పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తుంది.
ఈరోజు పరిశీలనకు....
ఈరోజు ఢిల్లీ ఐఐటీ నిపుణులు ఘాట్ రోడ్లను పరిశీలిస్తారు. కొండచరియలు విరిగిపడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసి టీటీడీకి నివేదిక ఇవ్వనున్నారు. ప్రస్తుతానికి మొదటి ఘాట్ రోడ్డు నుంచే రాకపోకలు కొనసాగుతున్నాయి. ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు మాత్రమే రాకపోకలకు అనుమతిస్తున్నారు.