గుండెపోటుతో డాలర్ శేషాద్రి మృతి
తిరుమల ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి మృతి చెందారు. ఆయనకు ఈరోజు తెల్లవారు జామున గుండెపోటు రావడంతో మరణించారు
తిరుమల ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి మృతి చెందారు. ఆయనకు ఈరోజు తెల్లవారు జామున గుండెపోటు రావడంతో మరణించారు. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఆయన మృతి చెందినట్లు తెలిసింది. కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు డాలర్ శేషాద్రి విశాఖకు వెళ్లారు. అక్కడే ఆయనకు గుండెపోటు వచ్చింది.
నాలుగు దశాబ్దాల నుంచి...
డాలర్ శేషాద్రి నాలుగు దశాబ్దాలుగా పైగానే ఆయన శ్రీవారి సేవలో ఉన్నారు. ఆయన 1978 నుంచి తిరుమల శ్రీవారి సేవలో తరిస్తున్నారు. 2007 లో పదవీ విరమణ చేసినా ఆయన సేవలను ఏ ప్రభుత్వం వచ్చినా ఉపయోగించుకుంటుంది. డాలర్ శేషాద్రి మృతి టీటీడీకి తీరని లోటని ఈవో ధర్మారెడ్డి అన్నారు.