ఎమ్మెల్యే కొలికపూడి అల్టిమేటం

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వార్తల్లోకి ఎక్కారు;

Update: 2025-01-28 06:41 GMT
kolikapudi srinivasa rao,  mla, tdp, thiruvuru
  • whatsapp icon

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తిరువూరు ఎస్ఐను సస్పెండ్ చేయాలని ఎస్పీకి అల్టిమేటం ఇచ్చారు. రేపటి లోపు తిరువూరు ఎస్ఐ ని సస్పెండ్ చేయకుంటే తాను బాధితులతో కలసి ధర్నాకు దిగుతానని ఆయన హెచ్చరించారు. తిరువూరు పోలీస్ స్టేషన్ ఎదుటే తాను ధర్నాకు దిగుతానని ఆయన చెప్పారు.

మహిళ పట్ల అనుచితంగా...
తిరువూరు ఎస్ ఐ ఒక మహిళ పట్ల అనుచితంగా వ్యవహరించారని, ఆ మహిళ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపిస్తున్నారు. పోలీసు అధికారిగా ఉండి రక్షణ కల్పించాల్సిన వారు అనుచితంగా వ్యవహరిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. అందుకే ఎస్ఐను సస్పెండ్ చేయాలంటూ ధర్నాచేస్తానని చెప్పారు.


Tags:    

Similar News