TDP : నేడు క్రమశిక్షణ కమిటీ ఎదుటకు కొలికపూడి
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నేడు టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు కానున్నారు.;

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నేడు టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు కానున్నారు. తిరువూరులో ఎస్టీ మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి కారణం కొలికపూడి అని ఫిర్యాదు అందడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై అంతర్గత విచారణకు ఆదేశించారు. క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరై కొలికపూడి శ్రీనివాసరావు తన వివరణ ఇచ్చుకోవాలని ఇప్పటికే ఆయనకు సమాచారం ఇచ్చారు.
తిరువూరు ఘటనపై...
ఈరోజు ఉదయం పదకొండు గంటలకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో క్రమశిక్షణ కమిటీ ఎదుట తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హాజరవుతున్నారు. జరిగిన ఘటనపై వివరణ ఇచ్చుకోనున్నారు. వరస వివాదాలతో పార్టీకి తలనొప్పిగా తయారైన కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారాన్ని చంద్రబాబు సీరియస్ గా తీసుకుని క్రమశిక్షణ కమిటీకి బాధ్యతలను అప్పగించారు.