క్రైయింగ్..టు క్యాపిటల్స్.... రూటు మారింది

మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు చట్టాన్ని ఏపీ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Update: 2021-11-22 08:20 GMT

ఈరోజు ఉదయం వరకూ చంద్రబాబు విలపించిన విషయమే హైలెట్ గా ఉంది. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న సమయంలో జగన్ ప్రభుత్వం కొత్త అంశాన్ని రాష్ట్రంలోకి పంపింది. ఇప్పుడు చంద్రబాబు ఏడుపు మరుగున పడనుంది. కొత్తగా మూడు రాజధానుల అంశాన్ని జగన్ తెరమీదకు తెచ్చి బాబు ఏడుపు విషయాన్ని డైవర్ట్ చేశారు. ఇప్పుడు రాష్ట్రమంతటా మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసిన అంశంపైనే చర్చ జరుగుతుంది.

మూడు రాజధానులు....
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు చట్టాన్ని ఏపీ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ కూడా వివరించారు. చంద్రబాబు నాలుగు రోజుల క్రితం బోరున విలపించిన దృశ్యాలను డైవర్ట్ చేసేందుకు జగన్ ప్రభుత్వానికి ఈ నిర్ణయం ఉపయోగపడిందంటున్నారు.


Tags:    

Similar News