తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. శనివారం అర్ధరాత్రి వరకు

Update: 2024-02-25 03:49 GMT

 TirumalaTirupati

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. శనివారం అర్ధరాత్రి వరకు 72,175 మంది స్వామివారిని దర్శించుకోగా 29,543 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.74 కోట్లు కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు 15 గంటల సమయం పడుతుంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. శ్రీవారి దర్శనం కోసం అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు.

కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఆలయంలో మార్చి 1 నుండి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 25న ఉద‌యం 11.30 నుంచి మ‌ధ్యాహ్నం 2.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఈ సందర్భంగా ఆలయం మొత్తాన్ని, పూజా సామగ్రిని శుద్ధిచేసి సుగంధ ద్రవ్యాలతో ప్రోక్షణం చేస్తారు. ఈ కారణంగా ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది.


Tags:    

Similar News