Tirumala : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. కార్తీక మాసం సోమవారం కావడంతో?

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కార్తీక సోమవారం కావడంతో భక్తులు అధికసంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు

Update: 2024-11-11 03:19 GMT

 Tirumala  Darshan

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కార్తీక సోమవారం కావడంతో భక్తులు అధికసంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. సాధారణంగా తిరుమలకు సోమవారం నుంచి గురువారం వరకూ భక్తుల సంఖ్య తిరుమలలో పెద్దగా ఉండదు. శుక్ర, శని, ఆదివారాలు మాత్రమే రద్దీ ఎక్కువగా ఉంది. అయితే కార్తీకమాసం సోమవారం కావడంతో తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలో రద్దీ పెరగడంతో వసతి గృహాలు కూడా దొరకడం దుర్లభంగా మారింది. వసతి గృహాల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. అదే సమయంలో అన్న ప్రసాద క్యాంటిన్ వద్ద కూడా భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. అదే సమయంలో క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు అన్న ప్రసాదాలను, మజ్జిగలను కూడా అందచేస్తున్నారు. తిరుమలలో రద్దీ పెరగడంతో అందుకు తగిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు.

హుండీ ఆదాయం...
కార్తీక సోమవారం తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకుంటే పుణ్యమని భావించిన అనేక మంది నిన్ననే తిరుమలకు చేరుకున్నారు. ఈరోజు స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. హుండీ ఆదాయం కూడా బాగానే ఉంది. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పది కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు స్వామి వారి దర్శనం మూడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 82,233 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,415 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.45 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News