నేడు టీటీడీ పాలకమండలి సమావేశం.. కీలక నిర్ణయా దిశగా?
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం నేడు జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం నేడు జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ డేంజర్ బెల్స్ మోగిస్తుండటంతో తిరుమలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాలకమండలి చర్చించి ఒక నిర్ణయం తీసుకోనుంది. అలాగే ఎఫ్ఎంఎస్ కార్మికుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని నిబంధనలను మారుస్తారని అంటున్నారు.
55 అంశాలపై....
దీంతో పాటు 55 అంశాలపై టీటీడీ పాలక మండలి చర్చించనుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడటం, దానికి పరిష్కారంపై కూడా పాలకమండలి నిర్ణయం తీసుకోనుంది. బంగారు ఆభరణాలను కరిగించి వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ అంశంపై కూడా చర్చించనుంది. గోల్డ్ డిపాజిట్లను బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మార్చే అంశాన్ని కూడా ఈ సమావేశంలో పరిశీలించనున్నారు.