టీటీడీ కీలక నిర్ణయం.. ఇక జిల్లా కేంద్రాల్లో?
రుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో పేదల వివాహాలు జరిపేందుకు టీటీడీ నిర్ణయించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో పేదల వివాహాలు జరిపేందుకు టీటీడీ నిర్ణయించింది. ఈ ఏడాది ఆగస్టు 7వ తేదీన ఏపీలోని 26 జిల్లాల్లో పేదల వివాహాలను జరపాలని నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కళ్యాణమస్తు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన గుర్తు చేశారు.
నమోదు చేసుకున్న వారికే....
ఇప్పుడు అదే తరహాలో 26 జిల్లాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పేదలకు కల్యాణాలను నిర్వహించాలని నిర్ణయించారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వివాహాలు చేసుకోదలచుకునే వారు కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాల్లో తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వైవీ సుబ్బారెడ్డి సూచించారు. ఆగస్టు 7వతేదీ ఉదయం 8 గంటల నుంచి 8.17 నిమిషాలు ముహూర్తంగా టీటీడీ నిర్ణయించిందని ఆయన తెలిపారు. అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. మిగిలిన రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు సహకరిస్తే కళ్యాణమస్తు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు టీటీడీ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. తాళిబొట్టుతో సహా అన్ని ఏర్పాట్లను టీటీడీయే చేస్తుంది.