నేడు మంత్రులకు శాఖలకు కేటాయింపు
నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు శాఖలను కేటాయించనున్నారు
నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు శాఖలను కేటాయించనున్నారు. నిన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా, 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే నిన్న సాయంత్రం మంత్రుల శాఖపై కసరత్తు చేసిన అనంతరం ఆయన తిరుమలకు బయలుదేరి వెళ్లారు. ఈరోజు తిరుమల నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మంత్రుల శాఖలపై క్లారిటీ ఇచ్చే అవకాశముంది. అధికారికంగా మంత్రులకు నేడు శాఖలను కేటాయించనున్నారు.
జనసేన మంత్రులకు...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను డిప్యూటీ సీఎం పదవితో పాటు ఆయనకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్లు తెలిసింది. పవన్ కల్యాణ తాను కోరుకున్నట్లుగానే చంద్రబాబు ఈ శాఖలను పవన్ కు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే నాదేండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేశ్‌కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖలను అప్పగిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శాఖలు కేటాయించిన తర్వాత మంత్రులు బాధ్యతలను స్వీకరించనున్నారు.