టామాటా ధర పడిపోయింది.. కేజీ ఎంతో తెలుసా?

నిన్న మొన్నటి వరకూ యాభై నుంచి నలభై రూపాయలు కేజీ పలికిన టమాటా నేడు పదిరూపాయలకు పడిపోయింది

Update: 2022-01-20 06:56 GMT

టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది. నిన్న మొన్నటి వరకూ యాభై నుంచి నలభై రూపాయలు కేజీ పలికిన టమాటా నేడు పదిరూపాయలకు పడిపోయింది. రెండు నెలల క్రితం టమాటా రూ. 150 లకు చేరుకుంది. టమాటా సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడం, ఇక్కడ సాగు ఎక్కువ విస్తీర్ణంలో కావడంతో ధర కొంచెం నలభై రూపాయలకు చేరుకుంది.

కిలో పది రూపాయలే....
అయితే ఈరోజు మాత్రం కిలో టమాటా పది రూపాయలకు చేరుకుంది. కానీ ఈరోజు పత్తికొండ మార్కెట్ లో పది రూపాయలకు పలికింది. మదనపల్లి తర్వాత అతి పెద్ద టమాటా మార్కెట్ పత్తికొండ మార్కెట్. ఎక్కువ దిగుబడి రావడంతో టమాటా ధర పూర్తిగా పడిపోయిందని, రానున్న రోజుల్లో మరింత ధర పడిపోయే అవకాశముందని చెబుతున్నారు.


Tags:    

Similar News