విషవాయువులు లీకయి ఇద్దరు మృతి
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మరో విషాదం చోటు చేుకుంది. విషయవాయువు లీక్ తో ఇద్దరు కార్మికులు మరణించారు.;
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మరో విషాదం చోటు చేుకుంది. విషయవాయువు లీక్ తో ఇద్దరు కార్మికులు మరణించారు. విశాఖ జిల్లాలోని పరవాడలోని జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో అర్ధరాత్రి విషవాయువులు లీకయ్యాయి. నైట్ షిఫ్ట్ లో పనిచేస్తున్న దుర్గా ప్రసాద్, మణికంఠ అనే కార్మికులు విషవాయువులు లీకయిన కారణంగా మృతి చెందినట్లు గుర్తించారు.
ప్రమాదానికి...?
మృతుల్లో ఒకరు తుని ప్రాంతానికి చెందిన వారు కాగా, మరొకరు పాయకరావుపేట ప్రాంతానికి చెందిన వారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్ కు తరలించారు. ప్రమాదానికి కారణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిపుణుల చేత విచారణ చేయిస్తున్నారు.