నిద్రిస్తుండగా పాము కాటు.. ముగ్గురి విద్యార్థుల పరిస్థితి విషమం

విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులు పాము కాటుకు గురయ్యారు.;

Update: 2022-03-04 03:55 GMT
snake, students, kuruapam, vijayanagaram district
  • whatsapp icon

విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులు పాము కాటుకు గురయ్యారు. కురుపాంలోని వెనకబడిన బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో నిద్రిస్తున్న విద్యార్థులను పాము కాటేసింది. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ముగ్గురిని పాము కాటు వేసింది.

ఆసుపత్రికి తరలింపు...
ముగ్గురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులు రంజిత్, వంశీ, వంగపండు నవీన్ లు రాత్రి నిద్రిస్తుండగా పాము కాటు వేయడంతో వారి పరిస్థితి విషమంగా మారింది. వీరిని విశాఖ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


Tags:    

Similar News