ప్రొద్దుటూరులో తప్పిన రైలు ప్రమాదం

ప్రొద్దుటూరులో రైలు ప్రమాదం తృటిలో తప్పింది. ప్లాట్‌ఫామ్ మీదున్న రైలులో మంటలు చెలరేగాయి;

Update: 2024-08-10 06:18 GMT
train accident proddutur, fire broke out
  • whatsapp icon

ప్రొద్దుటూరులో రైలు ప్రమాదం తృటిలో తప్పింది. ప్లాట్‌ఫామ్ మీదున్న రైలులో మంటలు చెలరేగాయి. అది గమనించిన ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తమయింది. ధర్మవరం నుండి విజయవాడ వెళుతున్న రైలులో ప్రొద్దుటూరుకు రాగానే బోగీ కింద భాగంలో మంటలు చెలరేగాయి.

మంటలను అదుపులోకి తెచ్చి...
ఇది గమనించిన ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. వెంటనే వారు రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. తర్వాత ఫైర్ మంటలను అదుపు చేశారు. ఈ రైలులో ఉన్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.. ప్రమాదానికి లోపానికి గల కారణాలు రైల్వే శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.


Tags:    

Similar News