తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్

తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో నడక దారిలో వచ్చే భక్తులకు టోకెన్లు మంజూరు చేస్తామంది

Update: 2023-03-03 12:33 GMT

తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో నడక మార్గంలో వచ్చే భక్తులకు దివ్యదర్శన టోకెన్లు మంజూరు చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. కరోనా సమయంలో నిలిపేసిన టోకెన్లు తిరిగి ప్రారంభించనుంది. కరోనా ముందు వరకూ కాలినడకన వచ్చే భక్తులకు సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు. అయితే దీనిని ఆపివేయడంతో కాలినడకన వచ్చే భక్తులు ఇబ్బంది పడుతున్నారు.

కాలినడకన వచ్చే...
కాలినడకన వచ్చి సర్వదర్శనం టోకెన్లు లేక శ్రీవారి దర్శనం కూడా కష్టంగా మారింది. ఇటీవల కొందరు భక్తులు తిరిగి సర్వదర్శనం టోకెన్లు ప్రవేశపెట్టాలని సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేశారు. దీనిపై టీటీడీ స్పందించింది. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత బడ్జెట్ వివరాలు ప్రకటిస్తామని టీటీడీ తెలిపింది. దీంతో పాటు శ్రీవాణి భక్తులకు తిరుమలలో 88 గదులను కేటాయించనున్నట్లు తెలిపింది. తిరుమలలో అన్న ప్రసాదంపై జరుగుతున్న దుష్ప్రచారం ఎవరూ నమ్మవద్దని కోరింది. ఏప్రిల్ నుంచి తిరిగి ఎలక్ట్రికల్ ఉచిత బస్సులను ప్రారంభిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.


Tags:    

Similar News